యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల ( Koratala Siva ) శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా దేవర ( Devara ) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దేవర సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం దేవర సినిమా హిందీ ధియేట్రికల్ హక్కులు మొత్తం 50 కోట్లకి అమ్ముడు పోయాయి. కేవలం హిందీ మార్కట్ కే ఈ రేంజ్ లో 50కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 130కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది.
ఇప్పటికే దేవర సినిమా ఆడియో రైట్స్ ని టి సిరీస్ ( TSeries ) 33 కోట్లకు సొంతం చేసుకుంది. దేవర సినిమా నుండి ఇప్పటికి కేవలం టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. ఒక్క టీజర్ కే ఈ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి అంటే.. ఆ తరువాత సినిమా నుండి రాబోతున్న సాంగ్స్ , ట్రైలర్ తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటడం కాయం. ఇన్ని అంచనాల మధ్య దేవర సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 100కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. సినిమా పై ప్రస్తుతం పెరుగుతున్న అంచనాలు చూస్తుంటే.. రిలీజ్ తరువాత కలెక్షన్స్ పరంగా మాస్ కుమ్ముడు కాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున అక్టోబర్ 10న దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో నటవిశ్వరూపం చూపించబోతున్నారు. దేవర సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా బాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేశాడు. కొరటాల శివ ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు.