పాన్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో దేవర ( Devara ) సినిమా ఒకటి. ఎన్టీఆర్ (NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున అక్టోబర్ 10న దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను స్టార్ట్ చేయబోతున్నారు.. ఈ షూట్ లో సైఫ్ అలీఖాన్ – ఎన్టీఆర్ లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దేవర సినిమా క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో నటవిశ్వరూపం చూపించబోతున్నారు. దేవర సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా బాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేశాడు. కొరటాల శివ ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు.