టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో కాజల్ అజిగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఇటీవలే టైటిల్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ఇప్పుడు టీజర్‌ను కూడా తెలుగు రాష్ట్రాల్లోని 108 థియేటర్లలో విడుదల చేసారు. భగవంత్ కేసరి 80 సెకన్ల రన్‌టైమ్‌ను కలిగి ఉండగా టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది.
తాజాగా ఈ టీజర్ యూటూబ్ లో రిలీజ్ కాగా టీజర్ ఇలా రిలీజ్ అయిదో లేదో అప్పుడే యూటూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది. మొత్తంగా టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా బాలయ్య చెప్పే డైలోగ్స్ టీజర్ కు మెయిన్ హైలెట్ గా మారాయి. ఈ టీజర్ చూస్తుంటే.. సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ ఊచకొత కాయం అనిపిస్తుంది. బాలకృష్ణ బర్త్ డే సంధర్బంగా రిలీజ్ అయిన భగవంత్ కేసరి టీజర్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయింది. బాగ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్ గా మారింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఒక స్పెషల్ రోల్ చేస్తుంది. తాజా రిలీజ్ అయిన భగవంత్ కేసరి టీజర్ యూటూబ్ వ్యూస్ పరంగా దుమ్ములేపుతూ.. దూసుకుపోతుంది.