Pushpa Itemsong Update :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంటపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది 3వ సినిమా..
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్లో దుమ్ములేపబోతున్నారట.
సుకుమార్ మూవీ అంటే అందులో ఐటెం సాంగ్ తప్పనిసరి. అదికూడా అదిరిపోయే రేంజ్ లో సగటు ప్రేక్షకుడు ఓ 5 నిమిషాల పాటు మైమరచిపోయేలా ఉంటుంది. అదే బాటలో ‘పుష్ప’ సినిమాలో కూడా మంచి ఐటెం సాంగ్ ఉంటుందట. ఇక ఈ సాంగ్లో అల్లు అర్జున్తో చిందేసేందుకు కొందరు బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం హాట్ బ్యూటీస్ అయినా దిశా పటాని, శ్రద్దా కపూర్, కీయరా అద్వాని వంటి హీరోయిన్స్ ను పరిసీలిస్తున్నారట. మరి బన్నీ సరసన అదిరిపోయే ఐటెం సాంగ్ కోసం ఎవరి సెలెక్ట్ చేస్తారో చూడాలి.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇది పాన్ ఇండియా మూవీ అని క్లారిటీ ఇచ్ఛారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రచారం అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్తో రష్మిక రొమాన్స్ అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేస్తున్నారట.
ప్యాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ‘పుష్ప’ చిత్రాన్ని విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకొని లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తదుపరి షెడ్యూల్స్ త్వరత్వరగా పూర్తి చేసి త్వరగా ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ బావిస్తున్నారు.
Telugu Movie News :
- Latest Telugu Best Item Songs – Telugu Item Video Songs
- Telugu Best Item Songs – Latest Telugu Item Video Songs
- Tamannah Best Item Songs | Tamannah Best Dance Hit Video Songs
- Sarileru Neekevvaru Worldwide Closing Collections
- Ala Vaikunthapurramuloo Worldwide Closing Box Office Collections
- Acharya Movie Release Date and First Look Teaser Update
- Tollywood hero’s Top Advance Birthday Trends – NTR Birthday Trend
- Mahesh Babu’s Maharshi 5th Time TRP Rating Report
- Top 10 Most Viewed New Telugu Movies on YouTube 2019 &…
- Anchor Anasuya Latest Hot Romantic Photos
Pushpa Movie Details :
Director: Sukumar
Music director: Devi Sri Prasad
Production company: Mythri Movie Makers
Language: Telugu
Screenplay: Sukumar