ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే రూ.180 కోట్లువసూలు చేసి 2023 లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా 18 రోజులను ముగించుకుంది. సంక్రాంతి వరకు పెద్దగా కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ పాన్ ఇండియా చిత్రం.. 6 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత కూడా తన హవా కొనసాగిస్తూ 10 రోజుల్లోనే ప్రతిష్టాత్మక 600 కోట్ల క్లబ్ లో చేరింది.
సినిమా మొదటి 13 రోజుల్లోనే 650 ( 650.41 ) కోట్లను దాటేయాగా.. సలార్ సినిమా తాజాగా మొదటి 19 రోజుల్లో 700 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ప్రభాస్ అన్న రికార్డుల మోత మాములుగా లేదు. సలార్ సినిమా 18వ రోజు తో పోల్చితే 19వ రోజు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగాయి. సినిమా మొదటి 17 రోజుల్లో 689 కోట్లు వసూలు చేయగా.. మొదటి 19 రోజుల్లో 700 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 54 లక్షల రేంజ్ లో షేర్ ని 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar Day 20 Total WW Collections Report(Inc GST):
Nizam: 71.09Cr
Ceeded: 22.60Cr
UA: 16.80Cr
East: 10.57Cr
West: 7.02Cr
Guntur: 9.27Cr
Krishna: 7.45Cr
Nellore: 4.72Cr
AP-TG Total:- 149.52CR(231.60CR~ Gross)
KA: 22.80Cr
Tamilnadu: 11.48Cr
Kerala: 6.88Cr
Hindi+ROI: 76.50Cr
OS – 64.45Cr*****
Total WW Collections: 331.63CR(Gross- 618.85CR~)