Vakeel Saab Theaters Count :
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న భారీ ఎత్తున రిలిజ్ కు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిదే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కూడా కావడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా తమ అభిమాన హీరో పేరిట సరికొత్త రికార్డులు ఎప్పుడు క్రియేట్ చేద్దామా అని ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 90 నుంచి 95 శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ సినిమాను భారీ ఎతున్న రిలీజ్ చేయనున్నారు. ఇక ఓవర్సీస్లో వకీల్ సాబ్ సినిమాను 700 లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. కరోనా బ్రేక్ తర్వాత ఓ భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ గా రిలీజ్ అవుతున్నా సినిమాగా వకీల్ సాబ్ మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో వకీల్ సాబ్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొత్తం వకీల్ సాబ్ సినిమాను 3 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.
Telugu Movie News :