మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫుల్ మాస్ రోల్ లో నటిస్తున్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని బాబీ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి సాంగ్స్ రెండూ కూడా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకాగా.. మొదటి రెండు సాంగ్స్ ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఆ అంచనాలను మరో రేంజ్ కు తీసుకు వెళ్ళే విధంగా 3వ సాంగ్ ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఇక ఈ మూవీ నుండి 3వ సాంగ్ అయిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మాస్ మహారాజా రవితేజ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, క్యాథరీన్ త్రెసా, వెన్నెల కిషోర్ వంటి వారు ఇతర ముఖ్య రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.