Acharya 1st Song :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా నుండి తాజాగా మొదటి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు.. కాజల్ అందాలు ఒక రేంజ్ లో ఉంది.
అయితే తాజాగా ఆచార్య సినిమానుండి ‘లాహే.. లాహే..’ ను రిలీజ్ చేసారు. ఇప్పటకే రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజ్ అయిన ఫుల్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది. సాంగ్ ప్రోమోలో ఒక్క స్టెప్ తో చిరు మెస్మరైజ్ చేయాగా.. తాజాగా వచ్చిన ఫుల్ సాంగ్ లో మెగాస్టార్ తన స్టెప్పులతో దుమ్ములేపారు.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను మే 13న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నరు.
Telugu Video Songs :