latest update on ntr’s devara movie shooting :
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ ( NTR ) హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’ ( Devara ). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల నాలుగో వారం నుంచి మొదలు కాబోతుందని, ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ ( saif ali khan )లపై కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. కాగా దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మరోవైపు ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నీవేషాలకు అలాగే దేవర దెబ్బకు థియేటర్స్ లో పూనకాలు కాయం అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు పాన్ ఇండియా మొత్తం దేవర సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తుంది.
అక్టోబర్ 10న దసరా పండుగ కానుకగా దేవర సినిమా వరల్డ్ వైడ్ గా.. భారీ ఎతున్న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ రెండు డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం దేవర సినిమా పై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ రికార్డులు క్రియేట్ చేయడం కాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.
Related Posts :