నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అఫీషియల్ టీసర్ ను బాలయ్య(Nandamuri Balakrishna) పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా.. ఈ టీసర్ కు ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ గా… రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.
ఇక సినిమా టీసర్ కి యూట్యూబ్ లో రికార్డు లెవల్ లో వ్యూస్ కూడా సొంతం చేసుకుంటూ.. ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ వ్యూస్ ను 24 గంటల్లో సొంతం చేసుకున్న…హీరోగా భగవంత్ కేసరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Bhagavanth Kesari Sri Leela Special Role:
భగవంత్ కేసరి కేసరి సినిమాలో శ్రీలీల(Sri Leela)ఒక స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిదే. అయితే ఆమె బాల కృష్ణ కు కూతురుపాత్రలో నటిస్తుంది అని తెలుస్తుంది. ఈ సినిమా తండ్రి కూతురు మధ్య ఉండే సెంటిమెంట్ తో ఉండబోతుంది అని తెలుస్తుంది. భగవంత్ కేసరి సినిమా ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చే సినిమాగా ఉండబోతుంది అని.. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర మెయిన్ హైలెట్ గా ఉండబోతుంది అని అమ్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ (Nandamuri Balakrishna)సరసన కాజల్ (Kajal) హీరొయిన్ గా నటిస్తుండగా.. బాలయ్య ఈ సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించనున్నారు. ఈ సినిమా మాస్ ఫైట్స్ తో పాటు అదిరిపోయే సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో బాగ్రౌండ్ స్కోర్ చూస్తే అర్ధమవుతుంది. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే బాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని తెలుస్తుంది. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మోత మోగించడం కాయం అనిపిస్తుంది.