పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఒక చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 4:14 నిమిశాలకు విడుదల చేసారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా పై ఇప్పటివరకు వున్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకువెళ్ళింది.
ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ కన్ఫాం చేయగా.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమా పై మంచి హైప్ ఉంది. అంతేకాక విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ నటిస్తున్న సినిమా కావడం తో అందరి చూపు ఈ చిత్రం పైనే ఉంది.
సాయి ధరం తేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం కాయంగా కనిపిస్తుండగా.. తాజా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ లుక్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.