Guntur Kaaram Jagapathi Babu Special Role :
గుంటూరు కారం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లుక్ చూసి ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాల్లో మహేష్ బాబును మళ్లీ చూసామని ఆ గత సినిమాలకు మించిన ఊర మాస్ అవతార్‌లో మహేష్ బాబు దర్శనమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ పండగ చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ( Guntur Kaaram ) . అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ( Trivikram ) కలిసి ఇప్పుడు మహేష్ బాబు సినిమా చేస్తున్న సినిమా ఇది. మహేష్‌కు ఈ సినిమా 28వ సినిమా వస్తుంది. ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఈ టైటిల్ ఫుల్ మాస్ గా ఉంది. ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.
ఇక ఈ వీడియో లో బాగ్రౌండ్ లో జగపతి బాబు ( Jagapathi babu ) కనిపిస్తారు. ఈ సినిమాలో జగపతి బాబు ఫుల్ వైలెంట్ గా వున్నారు. ‘గుంటూరు కారం’ సినిమాలో జగపతి బాబు విలన్ గా చేస్తుండగా అయన రోల్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.