Venkatesh – Naarappa Official First Look :
వెంకీమామ తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్..ఆ తరువాత వెంటనే మరో సినిమాను మొదలు పెట్టారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తమిళ్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నారు.
అసురన్ రీమేక్ వస్తున్న “నారప్ప” సినిమాలో వెంకటేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. తాజా రిలీజ్ అయిన నారప్ప ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉండేది కావడంతో సీమ జిల్లా అనంతపురంలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది.
Related Posts :
అల్లు అర్జున్ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డు..!
Latest Posts :