పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ వున్న సినిమాలలో పుష్ప 2 ( Pushpa The Rule ) కూడా ఒకటి ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ( Allu Arjun ) ఫాన్స్ పాన్ ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్నారు. పుష్ప ( Pushpa ) సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. పుష్ప 2 దానికి పది రెట్లు ఉండేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో పుష్ప రాజ్ అలాగే భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఎపిక్ ఫేస్ ఆఫ్ అలాగే ఇద్దరి ఈగో మధ్య పార్ట్ 2 లో గట్టిగా యుద్ధం ఉంటుంది అని అర్ధం అయ్యింది. అయితే పుష్ప పార్ట్ 2లో ఇప్పుడు సాలిడ్ సీక్వెన్స్ లు ఇద్దరి మధ్య చాలా ఎంగేజింగ్ గా ఉంటాయట. పుష్ప రాజ్ అలాగే భన్వర్ సింగ్ షెకావత్ మద్య భారీ పోరు ఉండేలా సుకుమార్ ( Sukumar ) డిజైన్ చేస్తున్నారు. పుష్ప రాజ్ అలాగే భన్వర్ సింగ్ షెకావత్ మధ్య వచ్చే సన్నీవేషాలకు థియేటర్స్ లో గూస్ బమ్స్ కాయమంటున్నారు.