Sai Pallavi Special role in Megastar new movie :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసదే. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆచార్య సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో 3 ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేశారు మెగాస్టార్.
అందులో ఒకటి వినాయక్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ కాగా.. మరొకటి మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ ఒకటి కావడం విశేషం. అయితే “వేదాలం” రీమేక్ కి సంభందించిన షూటింగ్ పనులను అప్పుడే మొదలు పెట్టేసారట. ఒక పక్క ఆచార్య సినిమా పనులను చూసుకుంటూ మరో పక్క లూసిఫర్, “వేదాలం” రీమేక్ కి సంభందించిన వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారట మెగాస్టార్.
అయితే “వేదాలం” రీమేక్ లో మెగాస్టార్ కు చెల్లి గా సాయి పల్లవి చేయనుందట. ‘వేదాలం’ సినిమాలో అజిత్ చెల్లెలి పాత్ర చాలా కీలకం అన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ పాత్రకోసం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించగా సాయి పల్లవి ఇందుకు ఒకే చెప్పిందని సమాచారం.
వేదాలం’ రీమేక్ కోసం మెగాస్టార్ గుండుతో దిగిన ఓ ట్రయిల్ లుక్ సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆలుమ డోలుమ అనే క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ అని వార్తలు వస్తున్నాయి. మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ మెగాస్టార్ హీరోగా ఎలా ఉండబోతుందో చూడాలి.
Telugu Movie News :