Skanda 1st Day Collections :
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్కంద (Skanda )సినిమా మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకుని 2వ రోజు లోకి అడుగుపెట్టింది. స్కంద సినిమా మొదటి రోజు నిజాం ఏరియాకు గాను 3.23 కోట్ల షేర్ వసూలూ చేయగా.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8.5 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఊరమాస్ స్టోరీ తో వచ్చిన స్కంద సినిమాకు రివ్యూలు కొంచం మిక్సుడ్ గానే ఉన్నప్పటికీ.. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర కంటిన్యూ చేస్తుంది. స్కంద సినిమాకు మాస్ ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ రాగా.. 2వ రోజు కూడా ఈ సినిమా మాస్ సెంటర్స్ లో దుమ్ములేపుతుంది.
రామ్ పోతినేని ( Ram Pothineni )కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఒప్పెనింగ్స్ అందుకున్న సినిమా స్కంద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక స్కంద సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ (Skanda 1st Day Collections )పరంగా వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. స్కంద సినిమాకు రెండవ రోజు కూడా మంచి ఆదరణ దక్కుతుండడంతో సినిమా మొదటి 3 రోజులు పొర్తి కాబోయే సరికి 50 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం కయంగా ఉంది.