Pushpa Movie Update :
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అల్లు అర్జున్ మాస్ లుక్ లో నటిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడంతో సినిమా..సినిమా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
బన్నీ రోల్ ను సుకుమార్ అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరొయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా పుష్ప సినిమా నుండి లీక్ అయిన అల్లు అర్జున్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో బన్నీ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఈ లుక్ లో అల్లు అర్జున్ ని చూసి ఫాన్స్ మురిసిపోతున్నారు. రఫ్ లుక్ లో ఆయిల్ స్కిన్ టోన్ తో అసలెప్పుడు చూడని విధంగా అల్లు అర్జున్ ఈ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ని చూసిన ఫాన్స్ బన్నీను సుకుమార్ మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నారా అంటూ ఆచర్యపోతురు.
Telugu Movie News :