మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫ్లానింగ్ తో వెళుతున్నారు. వినయ విదేయ రామ సినిమా పరాజయం తరువాత రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RRR సినిమా తరువాత రామ్ చరణ్ భారీ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ స్టార్ హీరో అజిత్ చేయబోయే ఒక తమిళ సినిమాలో నటించబోతున్నాడట. రామ్ చరణ్ అది కూడా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ధ్రువ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ రోల్ లో దుమ్ములేపారు.
అయితే అజిత్ తో చేయబోయే సినిమాలో రామ్ చరణ్ అదిరిపోయే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియాలి అంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా చేస్తూనే మరో పక్క ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా కాజల్ హీరొయిన్ గా నటిస్తుంది. ఆచార్య సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా సినిమాను సమ్మర్ కనుకగా రిలీజ్ చేయనున్నారు.
Telugu Movie News :
- పులి తో అల్లు అర్జున్ అదిరిపోయే ఫైట్..!
- మాజీ నక్సలైట్‌గా రామ్ చరణ్..!
- గుండు లుక్ ఎందుకో మెగాస్టార్ చెప్పేశారు..
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
Related Posts :