Allu Arjun Pushpa Movie New Look leak :
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతగానో కష్టపడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ లుక్ ఒకటి తాజాగా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ కల్డ్ మాస్ లుక్ మాములుగా లేదు. మాస్ గా అల్లు అర్జున్ పుష్ప లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
షూటింగ్ సెట్స్ నుండి లీకవుతున్న పుష్ప ఫొటోస్ లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ చూస్తుంటే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. అల్లు అర్జున్ మేకోవర్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. సుకుమార్.. అల్లు అర్జున్ పుష్ప పాత్రని వేరే లెవల్లో డిజైన్ చేసాడని మాత్రం అర్ధమవుతుంది. సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కబోతున్న మూడో చిత్రంపుష్ప కాగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Telugu Movie News :