vakeel saab movie shooting started with action scenes :
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సినిమా..వకీల్ సాబ్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా వస్తుందా.. ఎప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత మరో సినిమా చేయలేదు. పవర్ స్టార్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతుండగా, ఫ్యాన్స్ వీలైనంత త్వరగా వకీల్ సాబ్ సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నారు.కరోనా మహమ్మారి వలన ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఆగిపోయింది. 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారట.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, నివేదా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
Telugu Movie News :
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
Related Posts :