యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ప్రభాస్ ప్రస్తుతం రధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చేస్తూనే మరో భారీ సినిమాను సిద్ధమవుతున్నాడు ఆ సినిమానే ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న విషయం త్వరలోనే తెలియనుంది.
ఈ నేపథ్యంలో రాముడి తమ్ముడి పాత్ర లక్ష్మణుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఎప్పటి నుంచొ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఉండగా.. సరయిన సినిమా ఏది అనుకూలించక దాదాపుగా రామ్ చరణ్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా విషయంలో ముందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఆదిపురుష్ సినిమాలో రామ్ చరణ్ అల్ మోస్ట్ కన్ఫాం అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం పై ఆదిపురుష్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆదిపురుష్ లో రామ్ చరణ్ కన్ఫామ్ అయితే కనుక చెర్రి ఫాన్స్ కి పండుగనే అంటున్నారు. ఆదిపురుష్ లో లక్ష్మణుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడా..లేదా..అన్న విషయం మాత్రం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.
Telugu Movie News :
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- “ఆర్ ఆర్ ఆర్” నుండి రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
Related Posts :
- Vishnu Meets Saheba – V Movie Scene
- Nishabdham – Official Trailer
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Upcoming Telugu OTT Movies & Release Date
- Akshay Kumar Laxmmi Bomb Movie Hd Posters
- Hasina Pagal Deewani Video Songs – Indoo Ki Jawani Full…
Adipurush is a Hindi movie starring Prabhas in prominent role. It is a drama directed by Om Raut with Bhushan Kumar as producer, forming part of the crew.
Prabhas, Ram Charan, Saif Ali khan,