Super update about ram charan from RRR :
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్“. ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి తన సినిమా ప్రకటించినప్పుడే కథ ఎలా ఉండబోతుందో క్లుప్తంగా చెప్పేస్తారు.
బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతూ.. ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేస్తూ.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసుకుని.. తెలుగు సినిమా సత్తా చూపించిన దర్శకుడు ఒకే ఒక్క రాజమౌళి. అయితే కరోనా కారణంగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ఆగిపోగా.. సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారట.
ముందుగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించి టీజర్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ కరోనా కారణంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయలేదు.ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు సంబంధించి మొదట ఎన్టీఆర్ షాట్స్ తీసి ..టీజర్ ను విడుదల చెయ్యాలని రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్ చేసుకోవచ్చు అని పర్మిషన్లు ఇవ్వడంతో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ మొదలు పెట్టి ఎన్టీఆర్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనున్నారట. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొమరం భీమ్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.
Telugu Movie News :
- వరుణ్ తేజ్ కు..ఉరమాస్ విలన్..!
- అదిరిపోయే రేంజ్ లో వకీల్ సాబ్ రెండవ సాంగ్
- వకీల్ సాబ్ కోసం 110 కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
- పుష్ప లుక్ లో దుమ్ములేపుతున్న బన్నీ..!
- మెగాస్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!
- ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఆ రోజే..!
Related Posts :